డాక్టర్స్ డే సందర్భంగా కలికిరిలో ఘనంగా హెల్తీ 5K రన్ నిర్వహణ

కలికిరి, జూలై 1: డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), పీలేరు మరియు కపిలేశ్వర హాస్పిటల్స్, కలికిరి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 6.00 గంటలకు కలికిరి క్రాస్ రోడ్స్ నుండి నిర్వహించిన హెల్తీ 5K రన్ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది వైద్యులు, దంత వైద్యులు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ ప్రారంభ స్థలంలో నిర్వాహకులు రిజిస్ట్రేషన్ నిర్వహించి, రన్నింగ్ నంబర్లను అందజేశారు. అనంతరం కలికిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ గారు పాల్గొన్న వారికి రోడ్డు భద్రతా నియమాలు, రన్ సందర్భంగా పాటించాల్సిన...