Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యతోనే బంగారు భవిష్యత్తు: మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు-ఎమ్మెల్యే కిషోర్

    విద్యతోనే బంగారు భవిష్యత్తు: మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు-ఎమ్మెల్యే కిషోర్

    విద్య విద్యార్థులకు పేదరికం అనే సంకెళ్ళను తెంచే ఆయుధం కావాలి ఎమ్మెల్యే.

    విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దార్శనికతతో రాష్ట్రంలో విద్యారంగం స్వర్ణయుగంలోకి అడుగుపెడుతోందని పాఠశాలల రూపురేఖలు మార్చి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న యువ నాయకుడు లోకేష్ అని ఎమ్మెల్యే కొనియాడారు.

    అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం చిత్తూరు రోడ్డు మార్గంలో ఉన్న జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థినీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్య ఒక్కటే పేదరికాన్ని జయించే ఆయుధం. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుంటే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరంతా బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని. నాణ్యమైన పుస్తకాలు, యూనిఫాంలు ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతున్నాం. చదువుకు దూరం కావద్దని సూచించారు.

    ఇవి కూడా చదవండి

    చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడం పరీక్షలు రాయడం కాదు మనిషి ఆలోచనకు పదును పెట్టి, మంచి చెడులను విచక్షణతో చూడగలిగే శక్తినిచ్చేదే నిజమైన విద్య అని అన్నారు.

    విద్య విద్యార్థులకు అజ్ఞానం, మూఢనమ్మకాలు, పేదరికం అనే సంకెళ్లను తెంచే ఆయుధం, చీకటిని పారద్రోలే దీపంగా మారాలని, ఉపాధ్యాయులు కేవలం విద్యా జ్ఞానం ఇవ్వడమే కాదు దారి చూపే దార్శనికుడు, మార్గం చూపే మార్గదర్శక మారాలని అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఉన్న ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.

    ఈ గురుకులం నుంచి చదువుకుని కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు గా తయారు కావాలని అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మీ కలలు నిజం చేయడమే మా బాధ్యతని అన్నారు. అనంతరం బాలికలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

    పాఠశాల అద్దె భవనంలో నడుపుతున్నట్లు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ స్థలంలో నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు.

    బాలికలకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం కిట్లను పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేతులు మీదుగా అందజేశారు.

    అత్యధికంగా చదివినవి