విద్యతోనే బంగారు భవిష్యత్తు: మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు-ఎమ్మెల్యే కిషోర్

విద్య విద్యార్థులకు పేదరికం అనే సంకెళ్ళను తెంచే ఆయుధం కావాలి ఎమ్మెల్యే. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దార్శనికతతో రాష్ట్రంలో విద్యారంగం స్వర్ణయుగంలోకి అడుగుపెడుతోందని పాఠశాలల రూపురేఖలు మార్చి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న యువ నాయకుడు లోకేష్ అని ఎమ్మెల్యే కొనియాడారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం చిత్తూరు రోడ్డు మార్గంలో ఉన్న జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థినీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్య ఒక్కటే పేదరికాన్ని జయించే ఆయుధం. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుంటే ఆ కుటుంబంతో...