Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పల్స్ పోలియో విజయవంతం చేయాలి.. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో

    Author RAJANEETHI | 27 Jun 2026, 05:17 PM | ANDHRA PRADESH
    పల్స్ పోలియో విజయవంతం చేయాలి.. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో

    ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ పిలుపునిచ్చారు. పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఆయన, జిల్లా పరిశీలకులు ఏ.టి. రామనాథరావు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో 1,937 పోలియో కేంద్రాల్లో ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తామని, మిగిలిన వారికి ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామని తెలిపారు. "నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు" అంటూ ర్యాలీ నిర్వహించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు.

    పల్స్ పోలియో విజయవంతం చేయాలి.. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో - Additional Image
    అత్యధికంగా చదివినవి