Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉద్భవ అవార్డు అందుకున్న జూలియన్ రాజు

    Author RAJANEETHI | 26 Jun 2026, 05:11 PM | ANDHRA PRADESH
    ఉద్భవ అవార్డు అందుకున్న జూలియన్ రాజు

    సామాజిక సేవే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ అధ్యక్షుడు జూలియన్ రాజుకు అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరులోని ఇందిరానగర్ క్లబ్ వేదికగా శుక్రవారం నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్–317E వార్షిక సత్కార కార్యక్రమంలో ఆయనకు ప్రతిష్ఠాత్మక ఉద్భవ అవార్డు ను ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన లయన్స్ నాయకులను గుర్తించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేణిగుంట ప్రాంతంలో ఆరోగ్యం, విద్య, సామాజిక సేవ, పేదల సంక్షేమం, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు జూలియన్ రాజు సేవలను ప్రత్యేకంగా గుర్తించి ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అశ్వత్ నారాయణస్వామి చేతుల మీదుగా జూలియన్ రాజు అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. సభలో పాల్గొన్న లయన్స్ నాయకులు చప్పట్లతో ఆయనను అభినందించారు. అనంతరం జూలియన్ రాజు మాట్లాడుతూ ఈ అవార్డు తనకు వ్యక్తిగతంగా వచ్చిన గుర్తింపు కాదని, లయన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ కార్యవర్గ సభ్యులు, క్లబ్ సభ్యులు, సేవా కార్యక్రమాలకు సహకరించిన దాతలు, ప్రజలందరికీ దక్కిన గౌరవమని అన్నారు. రేణిగుంటలో నిర్వహించిన ప్రతి సేవా కార్యక్రమానికి ప్రజలు, దాతలు, సభ్యులు అందించిన సహకారమే తమకు ఈ స్థాయి గుర్తింపును తీసుకొచ్చిందని తెలిపారు. పేదలు, నిరుపేద విద్యార్థులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలవడమే తమ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సేవా సిద్ధాంతమైన "We Serve" భావనకు అనుగుణంగా సమాజంలో అవసరమైన ప్రతి చోట సేవ అందించేందుకు తమ క్లబ్ కట్టుబడి ఉంటుందని జూలియన్ రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అశ్వత్ నారాయణస్వామి, డిస్ట్రిక్ట్ నాయకులు, వివిధ ప్రాంతాలకు చెందిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ సభ్యులు తదితరులు పాల్గొని జూలియన్ రాజును అభినందించారు.

    అత్యధికంగా చదివినవి