ఉద్భవ అవార్డు అందుకున్న జూలియన్ రాజు

సామాజిక సేవే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ అధ్యక్షుడు జూలియన్ రాజుకు అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరులోని ఇందిరానగర్ క్లబ్ వేదికగా శుక్రవారం నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్–317E వార్షిక సత్కార కార్యక్రమంలో ఆయనకు ప్రతిష్ఠాత్మక ఉద్భవ అవార్డు ను ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన లయన్స్ నాయకులను గుర్తించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేణిగుంట ప్రాంతంలో ఆరోగ్యం, విద్య, సామాజిక సేవ, పేదల సంక్షేమం, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా...