Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జూన్ 30న విజయవాడ సియం రాయభార కార్యక్రమం ను జయప్రదం చేయండి!

    జూన్ 30న విజయవాడ  సియం రాయభార  కార్యక్రమం ను జయప్రదం చేయండి!

    ఎపి రైతు సంఘం పిలుపు:
    రైతులకు రు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని,, డా. స్వామినాధన్ కమీషన్ సిపార్సుల మేరకు అన్ని రకాల పంటలకు గిట్టుబాటు కల్పించాలని డిమాండ్ తో ఈనెల 30 తేదీన రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో సియం తో జరిపే రాయభార కార్యక్రమంను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం పిలుపిచ్చింది..
    ఈ మేరకు పీలేరు లో రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నేత డా. టి. జనార్దన్, అన్నమయ్య జిల్లా ఎపి రైతు సంఘం సహాయ కార్యదర్శి,,టి. ఎల్ వెంకటేష్,పీలేరు కార్యదర్శి పరదేశి రెడ్డి లతో కలసి ఛలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జనార్దన్ మాట్లాడుతూ రైతులు,, కౌలు రైతులు రుణ భారం నుండి విముక్తి కావడానికి తెలంగాణా తరహాలో రు..2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలని పేర్కొన్నారు... రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఉధ్యాన హబ్ ప్రకటనకే పరిమితమయిందని , నేడు, మామిడి,, బొప్పాయి,, అరటి,, ఉల్లి, నిమ్మ రైతులు గిట్టుబాటు ధర కోసం ప్రతి ఏటా రోడ్డెక్కే స్థితి కల్పించబడుతోందని తెలిపారు. అన్నదాత కు ఆదుకొనేందుకు 50 సంవత్సరాలు పైబడిన రైతులకు రు. 10 వేలు పెన్షన్ చెల్లించాలని కోరారు.. పంటల బీమా పథకం అన్ని పంటలకు అమలు చేసి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా లో కూడా మామిడి రైతులకు రు 4 సబ్సిడీ అందజేయాలని ఫ్యాక్టరీ యజమాన్యం, అక్రమాలు కట్టడి చేసి ప్రభుత్వ కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు..టమాటా కు కనీస మద్దతు ధర కిలో 25 రు.. చెల్లించాలని,, పీలేరు మదనపల్లె లలో ప్రభుత్వమే పల్ప్, జ్యూస్ ఫ్యాక్టరీ లు,, కోల్డ్ స్టోరేజ్ లు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. రైతులు జూన్ 30 న రైతు సంఘం చేపట్టే ఛలో విజయవాడ కు పెద్దసంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి యం. సాంబ,ఎఐటియుసి రాష్ట్ర సమితి సభ్యురాలు. పి. కవిత., తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి