Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఠానా వడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి - ఎమ్మెల్యే కిషోర్ దిగ్భ్రాంతి

    ఠానా వడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి - ఎమ్మెల్యే కిషోర్ దిగ్భ్రాంతి

    ఠానా వడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి - ఎమ్మెల్యే కిషోర్ దిగ్భ్రాంతి

    క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

    తేదీ: 26-06-2026, శుక్రవారం

    పీలేరు మండలం ఠాణా వడ్డిపల్లి సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం అత్యంత బాధాకరమని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    ఇవి కూడా చదవండి

    పీలేరు మండలం రేగల్లు గ్రామానికి చెందిన 8 మంది మొహరం పండుగ చూసేందుకు కలికిరి మండలం దూరేకులవారి పల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఠాణా వడ్డిపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

    విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శుక్రవారం ఉదయం పీలేరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. "ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. తీవ్రంగా గాయపడిన ఐదుగురు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

    ఆటో డ్రైవర్ ముబారక్ 55 మెహరున్ బి 70 నౌహిర్ 19 ముగ్గురు మృతి చెందగా, ఇర్ఫాని, ఆసిఫ్, వాహీద్, అఫ్జల్, సోహెబ్ ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.

    క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

    అత్యధికంగా చదివినవి