Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అవ్వకు ఆపరేషన్ రోజు... డాక్టర్ హృదయం చెప్పిన నిజం!!

    అవ్వకు ఆపరేషన్ రోజు... డాక్టర్ హృదయం చెప్పిన నిజం!!

    Morning OP చూసి అలసిపోయి OT లో డాక్టర్స్ రూములో రెఢీగా ఉన్న లంచ్ బాక్స్ తిని అనస్థీషియా డాక్టర్ వచ్చి మత్తు ఇచ్చే టైములో సరిగ్గా ఒక 30 నిమిషాలు నిద్రపోయి
    " Case ready sir " అనే పిలుపుతో లేస్తా అలా లేసి ఫ్రెష్ mind తో OT లోకి అడుగు పెట్టగానే table మీద drape చేసి రెడీగా ఉన్న పేషంట్ and C arm Machine మీద చెయ్యాల్సిన ఫ్రాక్చర్ ఇమేజ్ చెక్ చేసుకుంటా
    ఆ తర్వాత ఒక్కసారి పేషంట్ మొహం వైపు చూస్తా అవ్వ అవ్వచ్చు తాత కావచ్చు ఇంకెవరైనా సరే మనల్ని చూసే ఒక చూపు ఉంటుందండి అదే నాకు ఇచ్చే అతి పెద్ద మోటివేషన్ ఎలాగైనా బాగా చెయ్యాలని డబ్బులు ఇవన్నీ సెకండరీ..
    ఏమంత స్పెషల్ అంటే?? ఆ ఒక్క చూపులో డాక్టర్ వచ్చాడన్న ఆనందం ,ఒక నమస్కారం,ఎలాగైనా నువ్వే బాగు చేసి నన్ను నడిచేలా చెయ్యాలనే అభ్యర్థన , నిన్నే నమ్ముకున్నా నువ్వే దిక్కు అనే భావన అన్నీ కనిపిస్తాయి..
    ఇంట్లో పడిన దగ్గరి నుంచి ఎవరు చూడాలి కొడుకులా కూతుర్లా??ఏ కోడలు ఎన్ని రోజులు ఉండాలి?? డబ్బులు ఎవరు పెట్టాలి?? ఇలాంటి ప్రశ్నలు అన్నీ మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉంటూ వింటూ ఉంటుంది అవ్వ.. మనసులో మాత్రం ఎవరో ఒకరు హాస్పిటల్ తీసుకునిపోండి అనుకుంటూ ఏమి చెయ్యలేక గమ్మునే ఉంటుంది
    సరే వచ్చాక మాత్రం నార్మల్ ఉంటాయా పరీక్షలు ఒళ్ళు గుల్ల అయ్యేలా ఇన్ని సంవత్సరాలు శరీరాన్ని పట్టించుకోకుండా పడిన కష్టానికి తగిన ఫలితం ఉండనే ఉంటాయి అవే తగ్గిన రక్తం పెరిగిన creatinine అవన్నీ సరి చేసుకుని రక్తం ఎక్కించాక ఒక రోజు వస్తుంది అప్పుడు “రేపు చేద్దాం పోస్ట్ చెయ్యండి” అనే మాట..
    ఇంక ఆరోజు పొద్దున్నే అవ్వకు "ఇంకేమి తినకు మధ్యాహ్నం ఆపరేషన్ చేస్తా " అనేసి వెళ్ళిపోతా op చూసుకుని OT కి వెళ్తాను
    That That Day Is very important for her
    మనకూ రోజూ జరిగే కేసుల్లో అదొక్కటి
    కానీ అవ్వకు అదే జీవితం, ఆరోజు ఆమె బ్రతికే మిగిలిన 5 -10 సంవత్సరాల జీవితం ఎలా ఉండబోతుందో decide చేస్తుంది...
    ఆ చూసే ఒక్క చూపు మనకు ఇన్ని చెప్తుంది ఇవన్నీ గుర్తు చేస్తుంది..ఎలాగైనా బాగా చెయ్యాలనే మోటివేషన్ ఇస్తుంది
    డబ్బులు విసిగించిన attenders అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది..
    Now the Target is locked
    అవ్వను తొందరగా నడిపించాలి

    అత్యధికంగా చదివినవి