Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జూన్ 28న పోలియో ఆదివారం విజయవంతం చేద్దాం. ఎమ్. పి. డి. ఓ. మనోహర్ రాజు

    జూన్ 28న పోలియో ఆదివారం విజయవంతం చేద్దాం. ఎమ్. పి. డి. ఓ. మనోహర్ రాజు

    వాయల్పాడు 25/6/26.
    జూన్ 28వ తేదీ ఆదివారం రోజున అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించి పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేద్దామని వాయల్పాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ మనోహర్ రాజు పిలుపునిచ్చారు. ఈరోజు మండల కేంద్రం లోని ఎమ్. పి. డి . ఓ. కార్యాలయం లో మండల స్థాయి అధికారులతో పల్స్ పోలియో కార్యక్రమం పైన సమీక్ష నిర్వహించడం మరియు ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు, ఏ. ఎన్. ఎమ్ మరియు ఎమ్. ఎల్. హెచ్. పి. లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుచు మనదేశం లో 2011సంవత్సరము జనవరి నెలలో చివరి పోలియో కేసు నమోదు కావడం జరిగింది. దాదాపు 15సంవత్సరాలనుండి మనదేశం లో పోలియో కేసులు నమోదు కాలేదు. 2014సంవత్సరము లో మనదేశం పోలియో రహిత దేశముగా గుర్తించబడినది.జూన్ 28 ఆదివారం జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమం కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఇప్పటికే జిల్లా,, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ సమావేశాలు, పై ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్, ఎమ్. ఎల్. హెచ్. పీ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినదని తెలిపారు.
    పల్స్ పోలియో ఈ నెల 28 నుఁడి 30 వ తేది వరకు జరుగును మొదటి రోజు ఆదివారం(28/6/26) అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 స..లోపు పిల్లలకు పోలియో చుక్కలు బూత్ యందు వేయబడును. 29/6/26 మరియు 30 /6/26 తేదీలలో ఆశా, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఆదివారం పోలియో చుక్కలు వేసుకోకుండా తప్పిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయబడును.వారి ఇంటి పైన మార్కింగ్ చేయబడును.మండలం వ్యాప్తంగా వ్యాప్తంగా 47994 జనాబాకు గాను ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం 4589 మందిని గుర్తించడం జరిగింది.పోలియో చుక్కలు వేయడానికి జిల్లా వ్యాప్తంగా 40 బూత్లు, 4 రూట్స్ రెండు మొబైల్ టీమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సమశ్యాత్మక ప్రదేశాలు 7 (అనగా ఇటుక బట్టీలు, సంచార జాతులు, స్లమ్స్, వలసలు,నిర్మాణ ప్రదేశాలు, కోళ్ల ఫారాలు, పొలాల దగ్గర నివాసం ఉండే వారు) వున్నాయి. వీటి యందు వున్న పిల్లలకు ఆయా రూట్ సూపెర్వైషర్స్ ప్రత్యేక బృందాలు పోలియో చుక్కలు వేస్తారు. మొత్తము మండలం . పరిధిలో 4589మంది ఐదు స.. లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయబడును.ఈ పోలియో చుక్కల కార్యక్రమం లో మొత్తం 176మంది సిబ్బంది పాల్గొంటున్నారు.ఈ కార్యక్రమమునకు సంబందించిన శాఖల అధికారులు, సిబ్బంది, తల్లి తండ్రులు, ప్రజాప్రతినిధులు,మత పెద్దలు, స్వచ్చంద సేవా సంస్థలు సహకరించి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పక పోలియో చుక్కలను 💯 శాతం వేయించి పోలియో వ్యాధి లేని భారత దేశం ఏర్పాటు లో భాగస్వామ్యం కావాలని కోరడం అయినది.అనంతరం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో నగరిమడుగు పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ రిచర్డ్ స్టీఫిన్, సి. డి. ఓయ్. ఓ భారతి, ఎమ్. ఈ. ఓ. వెంకటలక్ష్మి, డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ, పి. హెచ్. ఎన్. నాగరాని మరియు సిబ్బంది పాల్గొన్నారు

    జైహింద్
    పోలియో వ్యాధి లేని భారతదేశం ఏర్పాటు మన లక్ష్యము అందుకే మనం పునరాంకితమవుదాం.
    జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
    అన్నమయ్య జిల్లా🙏

    అత్యధికంగా చదివినవి