Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రకృతి ప్రకోపం పెరుగుతోందా?.. వెనిజులాను వణికించిన భారీ భూకంపాలు!!!

    ప్రకృతి ప్రకోపం పెరుగుతోందా?.. వెనిజులాను వణికించిన భారీ భూకంపాలు!!!

    ప్రకృతి ప్రకోపం పెరుగుతోందా?.. వెనిజులాను వణికించిన భారీ భూకంపాలు

    వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్న వేళ.. మరోసారి ప్రకృతి తన భయానక రూపాన్ని చూపించింది.

    దక్షిణ అమెరికా దేశం వెనిజులాను వరుస భారీ భూకంపాలు అతలాకుతలం చేశాయి. జూన్ 24న సంభవించిన 7.2 తీవ్రత గల భూకంపం అనంతరం కొద్ది నిమిషాల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

    ఇవి కూడా చదవండి

    భూకంపాల కేంద్రం కారాకాస్ నగరానికి సమీప ప్రాంతంలో నమోదైనట్లు భూకంప పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 32 మంది మృతి చెందగా, 700 మందికిపైగా గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోవడంతో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు.

    రాజధాని కారాకాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లో విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    అమెరికా భూకంప పరిశోధన సంస్థ (USGS) అంచనాల ప్రకారం, నష్టం తీవ్రతను బట్టి తుది మరణాల సంఖ్య వేలల్లో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ప్రస్తుతం అధికారికంగా ధృవీకరించబడిన మరణాల సంఖ్య 32 మాత్రమే.

    ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వెనిజులా భూకంపం మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసింది. ప్రకృతి హెచ్చరికలను మానవాళి ఎంతవరకు గుర్తిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

    అత్యధికంగా చదివినవి