ప్రకృతి ప్రకోపం పెరుగుతోందా?.. వెనిజులాను వణికించిన భారీ భూకంపాలు!!!

ప్రకృతి ప్రకోపం పెరుగుతోందా?.. వెనిజులాను వణికించిన భారీ భూకంపాలు వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్న వేళ.. మరోసారి ప్రకృతి తన భయానక రూపాన్ని చూపించింది. దక్షిణ అమెరికా దేశం వెనిజులాను వరుస భారీ భూకంపాలు అతలాకుతలం చేశాయి. జూన్ 24న సంభవించిన 7.2 తీవ్రత గల భూకంపం అనంతరం కొద్ది నిమిషాల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంపాల కేంద్రం కారాకాస్ నగరానికి సమీప ప్రాంతంలో నమోదైనట్లు భూకంప పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 32 మంది మృతి చెందగా, 700 మందికిపైగా గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోవడంతో...