Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జిల్లా వ్యాప్తంగా విసిబుల్ పోలీసింగ్ నిర్వహించిన తిరుపతి జిల్లా పోలీసులు.

    జిల్లా వ్యాప్తంగా విసిబుల్ పోలీసింగ్ నిర్వహించిన తిరుపతి జిల్లా పోలీసులు.

    తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
    తేదీ: 24-06-2026.
    పత్రికా ప్రకటన

    - జిల్లా వ్యాప్తంగా విసిబుల్ పోలీసింగ్ నిర్వహించిన తిరుపతి జిల్లా పోలీసులు.

    - రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించిన పోలీసులు.

    - బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజల సహకారం కోరిన పోలీసు అధికారులు.

    ఇవి కూడా చదవండి

    తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు విసిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని వివరించారు.
    ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. మత సామరస్యం, సామాజిక ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.

    అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించడం, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.

    సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గుర్తు తెలియని ఫోన్ కాల్స్, లింకులు, నకిలీ పెట్టుబడి ఆఫర్లు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని తెలియజేశారు.

    బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డైల్ 112, పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.

    ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఇలాంటి విసిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.

    అత్యధికంగా చదివినవి