జిల్లా వ్యాప్తంగా విసిబుల్ పోలీసింగ్ నిర్వహించిన తిరుపతి జిల్లా పోలీసులు.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ. తేదీ: 24-06-2026. పత్రికా ప్రకటన - జిల్లా వ్యాప్తంగా విసిబుల్ పోలీసింగ్ నిర్వహించిన తిరుపతి జిల్లా పోలీసులు. - రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించిన పోలీసులు. - బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజల సహకారం కోరిన పోలీసు అధికారులు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు విసిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు...