Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటి ప్రచారాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్న ఎమ్మెల్యే కిషోర్

    "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటి ప్రచారాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి  ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్న ఎమ్మెల్యే  కిషోర్

    తేదీ: 23-06-2026, మంగళవారం

    కలికిరి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను ప్రజలకు నేరుగా చేరవేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని పీలేరు నియోజకవర్గంలో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

    అన్నమయ్య జిల్లా కలికిరి మండలం నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మండల, పట్టణ, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు బూత్ కన్వీనర్లు,కార్యకర్తలు, నల్లారి అభిమానులతో సమావేశం నిర్వహించి

    ఇవి కూడా చదవండి

    ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 25, 2026 నుండి 35 రోజులపాటు, 2026 వరకు ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. క్లస్టర్, యూనిట్, బూత్ (CUB) ఇన్‌ఛార్జ్‌లు సమన్వయంతో ప్రతి ఇంటినీ సందర్శించాలని సూచించారు.

    "రెండేళ్లలో మన కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, సుపరిపాలన, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికీ చేరవేయాలి. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, వారి సందేహాలు నివృత్తి చేయాలి. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని మరింత పెంచాలని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

    జూన్ 25న గుర్రంకొండ, వాయల్పాడు మండలాల్లో, 26న పీలేరు, కలికిరి,27 కెవిపల్లి కలకడలో ఉదయం, సాయంత్రం జరిగే ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో తాను స్వయంగా పాల్గొంటానని ఆయన వెల్లడించారు. యూనిట్ వైజ్‌గా జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ప్రజలకు వివరంగా తెలియజేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామంలో జరిగే కార్యక్రమాన్ని "మై టిడిపి" యాప్ లో అప్లోడ్ చేయాలని అన్నారు.

    అత్యధికంగా చదివినవి