"2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటి ప్రచారాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్న ఎమ్మెల్యే కిషోర్

తేదీ: 23-06-2026, మంగళవారం కలికిరి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను ప్రజలకు నేరుగా చేరవేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని పీలేరు నియోజకవర్గంలో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మండల, పట్టణ, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు బూత్ కన్వీనర్లు,కార్యకర్తలు, నల్లారి అభిమానులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు...