Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలియో రహిత సమాజ పరిరక్షణకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి

    పోలియో రహిత సమాజ పరిరక్షణకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి

    జూన్ 28 నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

    పల్స్ పోలియో–2026 విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి.

    – డీఎంహెచ్‌ఓ డా. కె. లక్ష్మీ నరసయ్య

    మదనపల్లె, జూన్ 23:

    జాతీయ రోగనిరోధక దినోత్సవం (NID) పల్స్ పోలియో కార్యక్రమం–2026 విజయవంతమైన అమలుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డా. కె. లక్ష్మీ నరసయ్య కోరారు.

    మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. జి. ఉషాశ్రీ, జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎల్ రాధిక తదితరులతో కలిసి డీఎంహెచ్‌ఓ అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ (DTF) సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలియోమైలిటిస్ నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా 1995-96 నుంచి ప్రతి సంవత్సరం ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో 1999 నాటికే పోలియో నిర్మూలనలో గణనీయమైన పురోగతి సాధించామని, ప్రస్తుతం జిల్లాలో వైల్డ్ పోలియో వైరస్ కేసులు లేవని చెప్పారు.

    ఇవి కూడా చదవండి

    దేశం పోలియో రహిత హోదాను కొనసాగించేందుకు జూన్ 28న దేశవ్యాప్తంగా జాతీయ రోగనిరోధక దినోత్సవం (NID) పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ బైవేలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (b-OPV) అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

    మొదటి రోజు పోలియో బూత్‌లలో టీకాలు వేయగా, రెండవ మరియు మూడవ రోజుల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వివరించారు. టీకా తీసుకున్న పిల్లల ఎడమ చేతి చిటికెన వేలిపై గుర్తు వేయనున్నట్లు తెలిపారు. 2011 జనవరి 13 తర్వాత దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని గుర్తుచేశారు.

    కార్యక్రమం విజయవంతానికి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, రవాణా శాఖ, రైల్వే శాఖ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ తదితర సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది బూత్‌లు మరియు ఇంటింటి సర్వే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.

    జిల్లా వ్యాప్తంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, నిర్మాణ స్థలాలు, గిరిజన ప్రాంతాలు మరియు ఇతర అధిక ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు.

    టీకా కార్యక్రమానికి అర్హులైన ఏ ఒక్క చిన్నారి కూడా దూరం కాకుండా అన్ని శాఖలు పూర్తి సహకారం అందించాలని, జాతీయ టీకా దినోత్సవం–2026ను ఘనవిజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ పిలుపునిచ్చారు.

    అనంతరం పోలియో నివారణ గోడ పత్రికలను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. జి. ఉషాశ్రీ, జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎల్ రాధిక,ఐసీడీఎస్ అధికారి హైమావతి, సంబంధిత వైద్య అధికారులు, తదితరులతో కలిసి డీఎంహెచ్‌ఓ డా. కె. లక్ష్మీ నరసయ్య ఆవిష్కరించారు.

    ఈ సమావేశంలో ఐసీడీఎస్ అధికారి హైమావతి, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఎస్ఆర్టీసీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బంది మరియు ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
    -------------------////----------
    ఏపీఆర్ఓ,అన్నమయ్య జిల్లా.

    అత్యధికంగా చదివినవి