పోలియో రహిత సమాజ పరిరక్షణకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి
జూన్ 28 నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి పల్స్ పోలియో–2026 విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. – డీఎంహెచ్‌ఓ డా. కె. లక్ష్మీ నరసయ్య మదనపల్లె, జూన్ 23: జాతీయ రోగనిరోధక దినోత్సవం (NID) పల్స్ పోలియో కార్యక్రమం–2026 విజయవంతమైన అమలుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డా. కె. లక్ష్మీ నరసయ్య కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. జి. ఉషాశ్రీ, జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎల్ రాధిక తదితరులతో కలిసి డీఎంహెచ్‌ఓ అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ (DTF)...