Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంతర్జాతీయ డైరెక్టర్ శ్రీ సోమిశెట్టి సురేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం

    Author RAJANEETHI | 23 Jun 2026, 01:26 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    అంతర్జాతీయ డైరెక్టర్ శ్రీ సోమిశెట్టి సురేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం

    అంతర్జాతీయ డైరెక్టర్ శ్రీ సోమిశెట్టి సురేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం

    జై వాసవి... జై జై వాసవి...

    వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కార్యనిర్వాహక డైరెక్టర్ శ్రీ సోమిశెట్టి సురేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పీలేరు ఇందిరమ్మ కాలనీ లోని ప్రభుత్వ పాఠశాలకు సుమారు రూ.10,000 విలువైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైక్ మరియు స్పీకర్) ను SOMISETTY సురేష్ బాబు గారు విరాళంగా అందజేశారు.

    ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఓబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అధ్యాపక బృందం మరియు విద్యార్థుల సమక్షంలో పాఠశాల ప్రార్థనా సమావేశం సమయంలో ఘనంగా నిర్వహించబడింది.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా వాసవి క్లబ్ పీలేరు అధ్యక్షులు శ్రీ రచపల్లి అనిల్ కుమార్, వాసవి కపుల్స్ క్లబ్ పీలేరు అధ్యక్షులు శ్రీ బి. ఉమా మహేష్, న్యూ రొంపిచర్ల వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీ ఎస్. హరి ప్రసాద్, డిస్ట్రిక్ట్ V-211A గవర్నర్ శ్రీ బోగ్గరపు వెంకట సురేష్ పాల్గొన్నారు.

    అలాగే వాసవి క్లబ్ సభ్యులు భరత్, తులసి కృష్ణ, చైతన్య, కృష్ణమూర్తి, లీలా సురేష్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    కార్యక్రమం అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు.

    ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వాసవి క్లబ్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థుల దైనందిన ప్రార్థనలు, సమావేశాలు మరియు ఇతర విద్యా కార్యక్రమాలకు ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.