Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేశ సేవకు గౌరవం.. వీర జవాన్ కుటుంబానికి, మాజీ సైనికుడికి ఇంటి స్థలాల మంజూరు

    దేశ సేవకు గౌరవం.. వీర జవాన్ కుటుంబానికి, మాజీ సైనికుడికి ఇంటి స్థలాల మంజూరు

    దేశ సేవకు గౌరవం.. వీర జవాన్ కుటుంబానికి, మాజీ సైనికుడికి ఇంటి స్థలాల మంజూరు

    సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

    మదనపల్లె, జూన్ 22:

    దేశ రక్షణ కోసం సేవలందించిన సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక కోటా కింద ఇంటి స్థలాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు.

    మదనపల్లె మండలం కురవంక గ్రామానికి చెందిన దివంగత వీరజవాన్ బి.సాయి తేజ గారి భార్య శ్రీమతి బి. శ్యామలకు ప్రభుత్వం ప్రత్యేక కోటా కింద ఇంటి స్థలం మంజూరు చేసింది. ఈ మేరకు మదనపల్లె మండల పరిధిలో 0.06 సెంట్ల భూమికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను బి. శ్యామలకు జిల్లా కలెక్టర్ అందజేశారు.

    అలాగే యుద్ధంలో అంగవైకల్యం పొందిన మాజీ సైనికుల కోటా కింద మదనపల్లె మండలం ప్రశాంత్‌నగర్‌కు చెందిన మాజీ హవనీర్ వి. సుబ్బారెడ్డికి కూడా 0.06 సెంట్ల భూమికి సంబంధించిన ఇంటి స్థలం మంజూరు ప్రొసీడింగ్స్‌ను కలెక్టర్ అందజేశారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..., దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల సేవలను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు కొనసాగిస్తుందని తెలిపారు. దేశం కోసం సేవలందించిన సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

    -డిఐపిఆర్వో, అన్నమయ్య జిల్లా

    అత్యధికంగా చదివినవి