దేశ సేవకు గౌరవం.. వీర జవాన్ కుటుంబానికి, మాజీ సైనికుడికి ఇంటి స్థలాల మంజూరు
దేశ సేవకు గౌరవం.. వీర జవాన్ కుటుంబానికి, మాజీ సైనికుడికి ఇంటి స్థలాల మంజూరు సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె, జూన్ 22: దేశ రక్షణ కోసం సేవలందించిన సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక కోటా కింద ఇంటి స్థలాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు. మదనపల్లె మండలం కురవంక గ్రామానికి చెందిన దివంగత వీరజవాన్ బి.సాయి తేజ గారి భార్య శ్రీమతి బి....