Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • SIRను అవమానించేవారికి జనసేన గట్టి హెచ్చరిక.. పుంగనూరు సమావేశం!!!

    SIRను అవమానించేవారికి జనసేన గట్టి హెచ్చరిక.. పుంగనూరు సమావేశం!!!

    ఈరోజు పుంగనూరు లో ఉన్న స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం లో జరుగుతున్న SIR కార్యక్రమంలో ప్రతి పంచాయతీ లో BLO తో పాటు సామాజిక సృహతో జనసైనికులు పాల్గొని ప్రజలు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు, అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు పైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా ప్రజలను కులాలవారీగా చూడను. తప్పు చేసిన వాడు ఏ కులం వాడైనా తప్పే అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులను పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే పని పెట్టుకున్నారు.

    పవన్ కళ్యాణ్ గారిని తిడితే జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడతారేమో కానీ, కాపు కులం పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారిని తిడితే కదా ప్రజలు మిమ్మల్ని రాజకీయ సమాధి చేసేది. మీరు అదే కొనసాగిస్తే మళ్ళీ అదే పునరావృతం అవుతుంది.

    జగన్ మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు పడుతున్న తపన పవన్ కళ్యాణ్ గారికి ఏమీ నష్టం కాదు. కాపు ప్రజానీకం అంతా చూస్తోంది. 2 సంవత్సరాల క్రితం మీకు బుద్ధి చెప్పారు, ఇప్పటికీ అదే పంథాలో వెళ్తే మీకు మనుగడ కూడా ఉండదు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు సింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, మండల అధ్యక్షడు విరూపాక్షి, జిల్లా పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, మండల కార్యదర్శులు బాలాజీ నాయక్, శ్రీనివాసులు , జనసైనికులు పవన్ నాయక్, బీవీ రమణ, జావేద్ తదితరులు పాల్గొన్నారు.,

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి