Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాల్లో ఉత్తమ సేవలు అందించిన గ్రంథాలయ అధికారులకు ఘన సన్మానం

    Author RAJANEETHI | 20 Jun 2026, 04:22 PM | ANDHRA PRADESH
    ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాల్లో ఉత్తమ సేవలు అందించిన గ్రంథాలయ అధికారులకు ఘన సన్మానం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాల విజయవంతమైన నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన గ్రంథాలయ అధికారులను ఘనంగా సన్మానించారు. శుక్రవారం తిరుపతిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రంథాలయాల్లో నిర్వహించిన ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థుల్లో మంచి స్పందన పొందాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలను ప్రజలకు మరింత చేరువ చేసి విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ శిబిరాల ద్వారా పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు, సృజనాత్మక ఆలోచనలు, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిల్వ కేంద్రాలు మాత్రమే కాదని, సమాజ నిర్మాణానికి పునాది వేస్తున్న జ్ఞాన వేదికలుగా మారాలని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని గురవారెడ్డి పేర్కొన్నారు. నేటి విద్యార్థులు మొబైల్, డిజిటల్ ప్రపంచంతో పాటు పుస్తకాల పట్ల కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. గ్రంథాలయాల ద్వారా గ్రామీణ ప్రాంతాల పిల్లలకు కూడా సమాన విద్యా అవకాశాలు అందించాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురు గ్రంథాలయ అధికారులకు రాష్ట్ర గ్రంథాలయ సంచాలకుల కార్యాలయం నుంచి పంపిన ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. సన్మాన గ్రహీతలు ఎన్‌.ఎస్‌.లావణ్య, చిత్తూరు ఇన్‌చార్జ్ ఉప గ్రంథాలయ అధికారి పి. రమాపతి, వాయల్పాడు గ్రేడ్–2 గ్రంథాలయ అధికారి చంద్రశేఖర్ నాయక్, కురబలకోట గ్రంథాలయ అధికారి సత్యవాణి, కుప్పం ఔట్‌సోర్సింగ్ గ్రంథాలయ అధికారి
    పురస్కారాలు అందుకున్నారు. వీరిని సభలో ఘనంగా అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ అధికారులు, సిబ్బంది కలిసి చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకొని విజ్ఞాన శిబిరాల్లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో గ్రంథాలయ కార్యక్రమాలను నిర్వహించి యువతను విజ్ఞాన దిశగా నడిపించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఆర్‌వీఆర్‌ఎస్‌ఎస్ శర్మ, తిరుపతి గ్రంథాలయ అధికారి మీనాకుమారి, చిత్తూరు గ్రంథాలయ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఆచారి, గ్రంథాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాల్లో ఉత్తమ సేవలు అందించిన గ్రంథాలయ అధికారులకు ఘన సన్మానం - Additional Image
    అత్యధికంగా చదివినవి