ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాల్లో ఉత్తమ సేవలు అందించిన గ్రంథాలయ అధికారులకు ఘన సన్మానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాల విజయవంతమైన నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన గ్రంథాలయ అధికారులను ఘనంగా సన్మానించారు. శుక్రవారం తిరుపతిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల...