Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తండ్రి జ్ఞాపకార్థం అన్నదానం

    Author RAJANEETHI | 16 Jun 2026, 08:06 PM | ANDHRA PRADESH
    తండ్రి జ్ఞాపకార్థం అన్నదానం

    పేదల ఆకలి తీర్చిన దలవాయి సోదరులు


    పీలేరు : దివంగత నేతల జ్ఞాపకాలను సేవా కార్యక్రమాలతో సజీవంగా నిలుపుతున్నారు టీడీపీ నాయకులు. పీలేరు పట్టణ అధ్యక్షులు దలవాయి సురేష్ కుమార్ రెడ్డి (అలియాస్ కంచి సూరి) మరియు వారి సోదరుడు దలవాయి బాలాజీ రెడ్డిల తండ్రి దివంగత దలవాయి వాసుదేవ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పీలేరులో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్‌లో కంచి సూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది నిరుపేదలు, వృద్ధులు, యాచకులు, కూలీలు పాల్గొని భోజనం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వారంతా దివంగత నేత దలవాయి వాసుదేవ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కంచి సూరి మాట్లాడుతూ.. తమ బాబాయ్ బతికున్న రోజుల్లో ఎప్పుడూ పేదలకు అండగా నిలిచేవారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే మిన్నయైన పుణ్యం మరొకటి లేదని, ఆయన వర్ధంతి రోజున ఈ అన్నదానం చేయడం ద్వారా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జయచంద్రారెడ్డి (షామియాన జయన్న), దేవులపల్లి చంద్రశేఖర్ రెడ్డి (డీసీఆర్), ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, దలవాయి కుటుంబ అభిమానులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.