తండ్రి జ్ఞాపకార్థం అన్నదానం
పేదల ఆకలి తీర్చిన దలవాయి సోదరులు పీలేరు : దివంగత నేతల జ్ఞాపకాలను సేవా కార్యక్రమాలతో సజీవంగా నిలుపుతున్నారు టీడీపీ నాయకులు. పీలేరు పట్టణ అధ్యక్షులు దలవాయి సురేష్ కుమార్ రెడ్డి (అలియాస్ కంచి సూరి) మరియు వారి సోదరుడు దలవాయి బాలాజీ రెడ్డిల తండ్రి దివంగత దలవాయి వాసుదేవ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పీలేరులో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్‌లో కంచి సూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది నిరుపేదలు, వృద్ధులు, యాచకులు, కూలీలు పాల్గొని భోజనం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా...