Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంచి అలవాట్లతో మేలైన ఆరోగ్యం

    Author RAJANEETHI | 05 Oct 2026, 04:35 PM | ANDHRA PRADESH
    మంచి అలవాట్లతో మేలైన ఆరోగ్యం

    వాయల్పాడు అక్టోబర్ 5 (రాజనీతి): విద్యార్థులు లక్ష్య సాధనలో రాణించాలంటే మంచి అలవాట్లు అలవర్చుకోవాలని తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ శ్రీగిరీష్‌ సూచించారు. బోడుమల్లువారిపల్లె ప్రాథమిక పాఠశాలలో మాప్‌అప్‌ డే సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్‌ 400 ఎంజీ మాత్రలు అందించారు. నులిపురుగులతో రక్తహీనత, కడుపునొప్పి, బలహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగింపు వంటి సమస్యలు తలెత్తవచ్చన్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, గోళ్లు చిన్నగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం, మరుగుదొడ్లు వినియోగించడం, చెప్పులు ధరించడం వంటి అలవాట్లు పాటించాలని సూచించారు.

    మంచి అలవాట్లతో మేలైన ఆరోగ్యం - Additional Image