Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైభవంగా శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

    Author RAJANEETHI | 02 Oct 2026, 04:17 PM | ANDHRA PRADESH
    వైభవంగా శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

    చౌడేపల్లి అక్టోబర్ 2 (రాజనీతి): చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలోని స్వయంభూ శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకురాలు శ్రావణి అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చౌడేపల్లి, పుంగనూరు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజలకు తాడేపల్లి బాలకృష్ణ, రాధ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త వినోద్‌కుమార్‌ భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.