Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పారదర్శకంగా ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తి చేయాలి

    Author RAJANEETHI | 30 Sep 2026, 04:20 PM | ANDHRA PRADESH
    పారదర్శకంగా ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తి చేయాలి

    మదనపల్లె సెప్టెంబర్ 30 (రాజనీతి): ఎస్‌ఐఆర్‌-2026లో భాగంగా ఎలక్టోరల్‌ రోల్‌ ప్రక్రియను పారదర్శకంగా, విశ్వసనీయంగా పూర్తి చేయాలని జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ కేసులు, చేర్పులు, తొలగింపులు, ఫొటోలు, డాక్యుమెంట్లను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఒకే డోర్‌ నంబర్‌లో 10కుపైగా ఓట్లు ఉంటే తప్పనిసరిగా వెరిఫై చేయాలని సూచించారు. బూత్‌ స్థాయి సమావేశాల మినిట్స్‌లో సంబంధితుల సంతకాలు ఉండేలా చూడాలన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు.