Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆరోగ్యకరమైన హృదయంతోనే ఆనందకరమైన జీవితం

    Author RAJANEETHI | 29 Sep 2026, 08:32 PM | ANDHRA PRADESH
    ఆరోగ్యకరమైన హృదయంతోనే ఆనందకరమైన జీవితం

    తలుపుల సెప్టెంబర్ 29 (రాజనీతి): ఆరోగ్యకరమైన హృదయంతోనే ఆనందకరమైన, వ్యాధుల రహిత జీవితం సాధ్యమని డిప్యూటీ హెచ్‌ఈఓ కొండయ్య అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గూడరేవుపల్లి పంచాయతీ మర్రిమాకులపల్లె తాండలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్రమం తప్పని వ్యాయామం, పౌష్టికాహారం, రక్తపోటు, బరువు నియంత్రణతో గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి అసంక్రమిత వ్యాధులను నివారించవచ్చన్నారు. ప్రజలతో ఆరోగ్య ప్రతిజ్ఞ చేయించారు. ఉచిత వైద్య శిబిరంలో చికిత్సలు అందించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు నాగమ్మ, ఏఎన్‌ఎం కృష్ణమ్మ, సీహెచ్‌ఓలు లావణ్య, విజయకుమారి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

    ఆరోగ్యకరమైన హృదయంతోనే ఆనందకరమైన జీవితం - Additional Image