Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాకమాను రాజశేఖర్‌ మృతి పార్టీకి తీరని లోటు

    Author RAJANEETHI | 26 Sep 2026, 05:29 PM | ANDHRA PRADESH
    కాకమాను రాజశేఖర్‌ మృతి పార్టీకి తీరని లోటు

    మదనపల్లి సెప్టెంబర్ 26 (రాజనీతి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టుకొమ్మగా నిలిచిన కాకమాను రాజశేఖర్‌ ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని వైసీపీ దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో శనివారం రాజశేఖర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీకి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం చేయాలని, దళిత మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, ప్రజా సంక్షేమ పాలన అందించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి చిన్న ఎల్లప్ప, కార్యదర్శి వడ్డీ హరి, రాష్ట్ర సహాయ కార్యదర్శి అంజన్నప్ప, మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ప్రసాద్‌బాబు, మాజీ ఎంపీపీ చంద్ర, పీలేరు నియోజకవర్గ అధ్యక్షుడు రాజన్న, మద్దిరాల మల్లికార్జున తదితర వైసీపీ నాయకులు, దళిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.