కాకమాను రాజశేఖర్ మృతి పార్టీకి తీరని లోటు
మదనపల్లి సెప్టెంబర్ 26 (రాజనీతి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మగా నిలిచిన కాకమాను రాజశేఖర్ ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని వైసీపీ దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో శనివారం రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీకి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం చేయాలని, దళిత మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, ప్రజా సంక్షేమ పాలన అందించాలని కోరారు....