Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘సూపర్‌ ఎల్‌నినో’తో భారత్‌కు ముప్పు.. 15,800 అదనపు మరణాల అంచనా ఎలా వచ్చిందంటే?

    ‘సూపర్‌ ఎల్‌నినో’తో భారత్‌కు ముప్పు.. 15,800 అదనపు మరణాల అంచనా ఎలా వచ్చిందంటే?

    రాజనీతి | న్యూఢిల్లీ:
    ‘సూపర్‌ ఎల్‌నినో’ ప్రభావంతో రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వేడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోకు చెందిన Climate Impact Lab రూపొందించిన నివేదిక ప్రకారం.. జూన్‌ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు ఎల్‌నినో కారణంగా సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.51 లక్షల అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత్‌లో ఈ సంఖ్య సుమారు 15,800గా పేర్కొంది. అయితే ఇవి నమోదైన మరణాలు కాదు.. మోడల్‌ ఆధారంగా రూపొందించిన అంచనాలు.

    అంచనా ఎలా రూపొందించారు? ఉష్ణోగ్రతల అంచనాలు.. మరణాల గణాంకాల అనుసంధానం! 24 వేలకు పైగా ప్రాంతాల డేటాతో అంచనా

    ఈ లెక్కల వెనుక ప్రధానంగా రెండు అంశాలను కలిపి పరిశీలించారు. ఒకటి.. రాబోయే కాలంలో ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులపై కాలానుగుణ వాతావరణ అంచనాలు. రెండోది.. ఉష్ణోగ్రత పెరుగుదలతో మరణాల సంఖ్య ఎలా మారుతుందనే గత పరిశోధనల ఆధారిత సంబంధాలు. ఈ రెండింటినీ కలిపి భవిష్యత్‌లో సంభవించే అదనపు వేడి సంబంధిత మరణాలను అంచనా వేశారు.

    24,000కు పైగా ప్రాంతాల డేటా

    Climate Impact Lab పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా 24,378 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, మరణాల మధ్య సంబంధాలను పరిశీలించారు. ప్రతి ప్రాంతంలోని వాతావరణం, ప్రజల ఆరోగ్య పరిస్థితులు, వేడిని తట్టుకునే సామర్థ్యం వంటి స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సంబంధాలను రూపొందించినట్లు సహ రచయిత ఎమిలీ గ్రోవర్‌-కోపెక్‌ తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    1996–2025ను ‘సాధారణ పరిస్థితి’గా తీసుకుని..

    రాబోయే ఉష్ణోగ్రతలను పోల్చేందుకు 1996 నుంచి 2025 వరకు 30 ఏళ్ల కాలాన్ని సాధారణ ఉష్ణోగ్రతల ప్రాతిపదికగా తీసుకున్నారు. అనంతరం యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం-రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్స్‌ (ECMWF) సీజనల్‌ ఫోర్‌కాస్ట్‌ ఆధారంగా భవిష్యత్‌ ఉష్ణోగ్రతలను అంచనా వేశారు.

    భారత్‌లో శీతాకాలంలోనూ వేడి ప్రభావం?

    భారత్‌కు సంబంధించిన అంచనాల్లో ప్రాంతాల మధ్య తేడాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఉత్తర భారతంలో శీతాకాల ఉష్ణోగ్రతలు సాధారణంగా తక్కువగా ఉండటంతో అక్కడ స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రత ప్రభావం పరిమితంగా ఉండొచ్చని.. దక్షిణ భారతంలో సాధారణ శీతాకాల ఉష్ణోగ్రతలే ఎక్కువగా ఉండటంతో అదనపు వేడి మరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని గ్రోవర్‌-కోపెక్‌ వివరించారు.

    ‘ఇవి అంచనాలు మాత్రమే’.. నిపుణుల హెచ్చరిక

    ఈ నివేదికలోని మరణాల సంఖ్యను మోడల్‌ ఆధారిత అంచనాలుగా మాత్రమే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. నివేదికలో ఉపయోగించిన పద్ధతుల్లో కొన్ని గత పరిశోధనల ఆధారంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత mortality projections పూర్తి స్థాయిలో peer review పొందలేదని NRDCకి చెందిన అబియంత్‌ తివారీ పేర్కొన్నారు.

    ఎల్‌నినో వేడి ఎంత పెరుగుతుంది? ఎక్కడ ప్రభావం ఎక్కువ? ముందస్తు అంచనాలే ఇప్పుడు కీలకం!