‘సూపర్ ఎల్నినో’తో భారత్కు ముప్పు.. 15,800 అదనపు మరణాల అంచనా ఎలా వచ్చిందంటే?
రాజనీతి | న్యూఢిల్లీ: ‘సూపర్ ఎల్నినో’ ప్రభావంతో రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వేడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన Climate Impact Lab రూపొందించిన నివేదిక ప్రకారం.. జూన్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు ఎల్నినో కారణంగా సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.51 లక్షల అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత్లో ఈ సంఖ్య సుమారు 15,800గా పేర్కొంది. అయితే ఇవి నమోదైన మరణాలు కాదు.. మోడల్ ఆధారంగా రూపొందించిన అంచనాలు. అంచనా ఎలా రూపొందించారు? ఉష్ణోగ్రతల అంచనాలు.. మరణాల గణాంకాల అనుసంధానం!...