Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌడేపల్లిలో ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం... ఐదేళ్ల సేవలను గుర్తుచేసుకున్న నాయకులు.. ఆత్మీయ సమావేశం

    Author RAJANEETHI | 24 Sep 2026, 07:09 PM | ANDHRA PRADESH
    చౌడేపల్లిలో ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం... ఐదేళ్ల సేవలను గుర్తుచేసుకున్న నాయకులు.. ఆత్మీయ సమావేశం

    చౌడేపల్లి, సెప్టెంబరు 24 (రాజనీతి): మండల పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన సందర్భంగా చౌడేపల్లిలో ఆత్మీయ సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. జడ్పీటీసీ దామోదరరాజు, వైస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులకు శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించారు. ఐదేళ్ల పదవీకాలంలో ప్రజలకు అందించిన సేవలు, మండల అభివృద్ధికి చేసిన కృషిని నాయకులు గుర్తుచేసుకున్నారు. తమకు సహకరించిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బందికి ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాగభూషణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రమణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి రుక్మిణమ్మ, మాజీ ఎంపీపీ అంజిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.