Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

    Author RAJANEETHI | 23 Sep 2026, 07:16 PM | ANDHRA PRADESH
    విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

    రేణిగుంట, సెప్టెంబరు 23 (రాజనీతి): రేణిగుంట మండలం ఎల్లమండ్యం పంచాయతీ పరిధిలోని పిల్లపల్లెం హరిజనవాడలో విద్యుత్‌ షాక్‌కు గురై మంచికాయల రేణుకార్జున (47) మృతి చెందాడు. మంగళవారం రాత్రి గ్రామానికి నీటి సరఫరా చేసే వాటర్‌ ట్యాంక్‌ వద్ద పంచాయతీ మోటార్‌ను ఆఫ్‌ చేసేందుకు వెళ్లిన సమయంలో స్టార్టర్‌ను తాకగా విద్యుత్‌ షాక్‌కు గురై కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు రేణిగుంటలోని సన్‌రైస్‌ ఆస్పత్రికి, అనంతరం రుయా ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. స్టార్టర్‌కు విద్యుత్‌ సరఫరా చేసే వైరు దెబ్బతినడం వల్ల ఐరన్‌ బాక్స్‌కు విద్యుత్‌ ప్రసరించి ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. భార్యకు ఎలాంటి అనుమానం లేదని తెలిపింది. గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.