Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టీడీపీ కోటకు పునాది.. కార్యాలయ నిర్మాణానికి జోరు!...చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్...

    టీడీపీ కోటకు పునాది.. కార్యాలయ నిర్మాణానికి జోరు!...చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్...

    చిత్తూరు( రాజనీతి ):చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరిలు బుధవారం పరిశీలించారు. భవనంలోని మొదటి అంతస్తు స్లాబ్ నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులను ప్రారంభించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన నాయకులు.. నిర్ణీత ప్రమాణాలతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు వీడియో కాల్ ద్వారా చూపించి వివరించారు. నిర్మాణ పనుల వివరాలను ఆయనకు తెలియజేశారు. అనంతరం గుత్తేదారుతో మాట్లాడి పనుల నాణ్యత, నిర్మాణ ప్రణాళిక, తదుపరి దశ పనులపై పలు సూచనలు చేశారు. పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు పేర్కొన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీఎన్‌ రాజసింహులు, నగర పార్టీ అధ్యక్షుడు వరుణ్‌కుమార్‌, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ త్యాగరాజన్‌, నాయకులు అరుణ, మోహన్‌రాజ్‌తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.