టీడీపీ కోటకు పునాది.. కార్యాలయ నిర్మాణానికి జోరు!...చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్...

చిత్తూరు( రాజనీతి ):చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరిలు బుధవారం పరిశీలించారు. భవనంలోని మొదటి అంతస్తు స్లాబ్ నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులను ప్రారంభించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన నాయకులు.. నిర్ణీత ప్రమాణాలతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు వీడియో కాల్ ద్వారా చూపించి వివరించారు. నిర్మాణ పనుల వివరాలను ఆయనకు తెలియజేశారు. అనంతరం గుత్తేదారుతో మాట్లాడి పనుల...