Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నులిపురుగుల నిర్మూలన దినాన్ని విజయవంతం చేయాలి... ఎంపీడీవో రాధారాణి

    Author RAJANEETHI | 23 Sep 2026, 02:37 PM | ANDHRA PRADESH
    నులిపురుగుల నిర్మూలన దినాన్ని విజయవంతం చేయాలి... ఎంపీడీవో రాధారాణి

    కలికిరి, సెప్టెంబరు 23 (రాజనీతి): ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో రాధారాణి పిలుపునిచ్చారు. మండలంలోని 1 నుంచి 19 ఏళ్లలోపు 4,560 మంది పిల్లలకు ఆల్బెండజోల్‌ 400 మి.గ్రా. మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలకు గైర్హాజరైన వారికి అక్టోబరు 5న మాత్రలు అందిస్తామన్నారు. పిల్లల్లో రక్తహీనత నివారణకు ఏటా రెండుసార్లు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం గోడపత్రికలను ఆవిష్కరించి ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ హేమంత్‌కృష్ణ, డిప్యూటీ ఎంపీడీవోలు నాగరాజు, ఇరాషుల్లా, డీహెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

    నులిపురుగుల నిర్మూలన దినాన్ని విజయవంతం చేయాలి... ఎంపీడీవో రాధారాణి - Additional Image