Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • “ఆధారాలున్నాయా.. బయటపెట్టండి!” క్వారీ ఆరోపణలపై గురజాల జగన్‌ మోహన్ ఫైర్

    “ఆధారాలున్నాయా.. బయటపెట్టండి!” క్వారీ ఆరోపణలపై గురజాల జగన్‌ మోహన్ ఫైర్

    చిత్తూరు ( రాజనీతి ):తన పీఏ అక్రమ క్వారీలతో కోట్లు సంపాదిస్తున్నారంటూ విజయానందరెడ్డి వర్గం చేస్తున్న ఆరోపణలపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ ఘాటుగా స్పందించారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్వారీ ఎవరిది, యజమాని ఎవరో తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తన పీఏ బీసీ ఉద్యోగి కావడం జీర్ణించుకోలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.తన పై, పీఏపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గురజాల జగన్‌ మోహన్ సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ క్వారీలు, అక్రమ వసూళ్లు, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ జరిపి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించాలని కలెక్టర్‌, ఎస్పీలను కోరారు. తాను వ్యక్తిగత దూషణలకు దిగనని, తండ్రికి ఇచ్చిన మాట మేరకు చిత్తూరు అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అభివృద్ధి పనులు చేపడుతున్న సమయంలో అనవసర ఆరోపణలు చేయడం తగదన్నారు. తన పీఏ కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఆరోపణలు చేస్తున్న వారు కూడా తాము చేసిన ఆరోపణలపై ఆధారాలతో ముందుకు రావాలని అన్నారు. రాజకీయ విమర్శలకు బదులు వాస్తవాలపై చర్చ జరగాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, టీడీపీ నగర అధ్యక్షుడు వరుణ్‌కుమార్, వెంకటేష్‌యాదవ్, నీరజాక్షి, చిట్టిబాబు, లీలావతి తదితరులు పాల్గొన్నారు.