“ఆధారాలున్నాయా.. బయటపెట్టండి!” క్వారీ ఆరోపణలపై గురజాల జగన్‌ మోహన్ ఫైర్

చిత్తూరు ( రాజనీతి ):తన పీఏ అక్రమ క్వారీలతో కోట్లు సంపాదిస్తున్నారంటూ విజయానందరెడ్డి వర్గం చేస్తున్న ఆరోపణలపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ ఘాటుగా స్పందించారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్వారీ ఎవరిది, యజమాని ఎవరో తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తన పీఏ బీసీ ఉద్యోగి కావడం జీర్ణించుకోలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.తన పై, పీఏపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గురజాల జగన్‌ మోహన్ సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ...