Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పసేలి రాజేష్‌కు ‘ఉత్తమ సేవా పురస్కారం-2026’

    Author RAJANEETHI | 20 Sep 2026, 06:11 PM | ANDHRA PRADESH
    పసేలి రాజేష్‌కు ‘ఉత్తమ సేవా పురస్కారం-2026’

    రేణిగుంట, సెప్టెంబరు 20 (రాజనీతి): సమాజ సేవ, రక్తదాన రంగాల్లో విశేష సేవలందిస్తున్న యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆంధ్రప్రదేశ్ వైస్‌ ప్రెసిడెంట్‌ పసేలి రాజేష్‌కు ప్రతిష్ఠాత్మక ఉత్తమ సేవా పురస్కారం-2026 లభించింది. భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌ టౌన్‌లోని పీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. నిర్వాహకులు రాజేష్‌ను శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ఆయన సేవలను వక్తలు అభినందించారు. ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడుతూ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులోనూ రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.