Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అన్న అంటే.. అండగా నిలిచే గురజాల జగన్‌మోహన్!

    అన్న అంటే.. అండగా నిలిచే గురజాల జగన్‌మోహన్!

    చిత్తూరు ( రాజనీతి ): పదవిలో ఉన్నా.. లేకున్నా ప్రజలతో తన అనుబంధం మారదని చాటుకుంటున్నారు చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్. సమస్య ఏదైనా.. తమకు అండగా అన్న ఉన్నారనే నమ్మకంతో ప్రజలు ఆయనను ఆశ్రయిస్తున్నారు. తన నివాసానికి వచ్చే ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ఇంట్లో కూర్చోబెట్టి వారి సమస్యలను తెలుసుకుంటున్న తీరు ప్రజలతో ఆయనకున్న అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.

    ప్రజలే కుటుంబం.. సేవే లక్ష్యం...

    రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే ప్రజలతో ఏర్పడిన బంధం మాత్రం శాశ్వతంగా ఉండాలన్నదే గురజాల జగన్‌ మోహన్‌ ఆలోచనా విధానంగా కనిపిస్తోంది. పదవిలో ఉన్న సమయంలో ఎలా ప్రజలను కలుస్తారో.. పదవి లేని సమయంలోనూ అదే ఆప్యాయత అదే అందుబాటు కొనసాగిస్తున్నారనే అభిప్రాయం ఆయనను కలిసే ప్రజల్లో వ్యక్తమవుతోంది. తమ ఇంటి సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన వారిని సాదరంగా పలకరిస్తూ, వారి మాటలను శ్రద్ధగా వినడం ద్వారా భరోసా కల్పిస్తున్నారు.

    ఇవి కూడా చదవండి

    'అన్న ఉన్నారు’.. ఇదే ప్రజల విశ్వాసం...

    పేదలు, సామాన్యులు, వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గురజాల జగన్‌ మోహన్‌ను సంప్రదిస్తున్నారు. తమ కష్టాలను చెప్పుకునేందుకు ఆయన నివాసానికి వచ్చే ప్రజలకు ఆత్మీయతతో స్వాగతం పలకడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం ద్వారా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అనుచరులు పేర్కొంటున్నారు.పదవి ఉన్నా.. లేకున్నా ప్రజల మధ్యే ఉంటూ, ఆప్యాయతను పంచుతున్న గురజాల జగన్‌ మోహన్‌ తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.