అన్న అంటే.. అండగా నిలిచే గురజాల జగన్‌మోహన్!

చిత్తూరు ( రాజనీతి ): పదవిలో ఉన్నా.. లేకున్నా ప్రజలతో తన అనుబంధం మారదని చాటుకుంటున్నారు చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్. సమస్య ఏదైనా.. తమకు అండగా అన్న ఉన్నారనే నమ్మకంతో ప్రజలు ఆయనను ఆశ్రయిస్తున్నారు. తన నివాసానికి వచ్చే ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ఇంట్లో కూర్చోబెట్టి వారి సమస్యలను తెలుసుకుంటున్న తీరు ప్రజలతో ఆయనకున్న అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజలే కుటుంబం.. సేవే లక్ష్యం... రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే ప్రజలతో ఏర్పడిన బంధం మాత్రం శాశ్వతంగా ఉండాలన్నదే గురజాల జగన్‌ మోహన్‌ ఆలోచనా విధానంగా కనిపిస్తోంది. పదవిలో ఉన్న సమయంలో ఎలా ప్రజలను కలుస్తారో.. పదవి లేని సమయంలోనూ...