Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కష్టకాలంలో వెన్నుదన్నుగా... కజూర్ బాలాజీకి మేయర్ అవకాశం వస్తుందా?

    కష్టకాలంలో వెన్నుదన్నుగా... కజూర్ బాలాజీకి మేయర్ అవకాశం వస్తుందా?

    చిత్తూరు (రాజనీతి)డైలీ దినపత్రిక: తెలుగుదేశం పార్టీ కోసం కొన్నేళ్లుగా పనిచేస్తూ, పార్టీ కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా నిలిచిన సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ పేరు ప్రస్తుతం చిత్తూరు నగర రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.ప్రస్తుతం చిత్తూరు నగరంలో గడపగడపకూ వెళ్లి ప్రజలను కలుస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని అనుచరులు పేర్కొంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని సంబంధిత నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
    ఇదిలా ఉండగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు మేయర్ పదవిపై పలువురి పేర్లు చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో కజూర్ బాలాజీ పేరు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన అనుభవం, కార్యకర్తలతో అనుబంధం, ప్రజల్లో అందుబాటులో ఉండే తీరంతో ఆయనకు అవకాశం దక్కాలనే ఆకాంక్ష అనుచరుల్లో వ్యక్తమవుతోంది.అయితే మేయర్ అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం, ఎన్నికల సమయంలో అమల్లో ఉండే రిజర్వేషన్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీంతో కార్యకర్తగా మొదలైన కజూర్ బాలాజీ ప్రస్థానం.. మేయర్ పీఠం దిశగా సాగుతుందా? అన్నది చిత్తూరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.