కష్టకాలంలో వెన్నుదన్నుగా... కజూర్ బాలాజీకి మేయర్ అవకాశం వస్తుందా?

చిత్తూరు (రాజనీతి)డైలీ దినపత్రిక: తెలుగుదేశం పార్టీ కోసం కొన్నేళ్లుగా పనిచేస్తూ, పార్టీ కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా నిలిచిన సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ పేరు ప్రస్తుతం చిత్తూరు నగర రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.ప్రస్తుతం చిత్తూరు నగరంలో గడపగడపకూ వెళ్లి ప్రజలను కలుస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని అనుచరులు పేర్కొంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని సంబంధిత నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని...