Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వివక్షతను అంతం చేద్దాం.. గౌరవాన్ని కాపాడుదాం...డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ

    Author RAJANEETHI | 16 Sep 2026, 07:34 PM | ANDHRA PRADESH
    వివక్షతను అంతం చేద్దాం.. గౌరవాన్ని కాపాడుదాం...డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ

    సదుం, సెప్టెంబర్‌ 16 (రాజనీతి): కుష్ఠు వ్యాధిపై సమాజంలో ఉన్న వివక్షతను అంతం చేసి, బాధితుల గౌరవాన్ని కాపాడాలని డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ రఫీ పిలుపునిచ్చారు. సోమల పీహెచ్‌సీ పరిధిలో ఈనెల 11 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న ఇంటింటి కుష్ఠు వ్యాధి సర్వేపై సదుం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అవగాహన సమావేశం నిర్వహించారు. కుష్ఠు వ్యాధికి పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితమని తెలిపారు. స్పర్శ లేని మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి, అనుమానిత మచ్చలను పరిశీలించారు. వంట సిబ్బందికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ ప్రదీప్‌, సీహెచ్‌ఓ అమర్‌నాథ్‌, పర్యవేక్షకులు వసంత, ఆరోగ్య కార్యకర్త సుధాకర్‌, ఆశా కార్యకర్తలు, పీఈటీ కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

    వివక్షతను అంతం చేద్దాం.. గౌరవాన్ని కాపాడుదాం...డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ - Additional Image