Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

    Author RAJANEETHI | 15 Sep 2026, 03:57 PM | ANDHRA PRADESH
    మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

    రేణిగుంట, సెప్టెంబర్‌ 15 (రాజనీతి): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే సంకల్పంతో రేణిగుంట జీఎం వీధిలోని శ్రీ అభయ వినాయక అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 31 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడంతో పాటు చివరి రోజు నిమజ్జనం చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈనెల 19న సన్‌రైజ్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం, సాయంత్రం చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజు 108 చెంబులతో పాలాభిషేకం, 3 వేల మందికి పైగా అన్నదానం, సాయంత్రం 6 గంటలకు నిమజ్జనం చేపట్టనున్నారు. మంగళవారం చెంజి నాగతేజస్వి సహకారంతో అన్నదానం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి స్వామివారికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు లక్ష్మణ్‌, సుమన్‌, కళ్యాణ్‌, జూలియన్‌రాజు ఆమెను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సుబ్బు, హేమాద్రి, పవన్‌, గజ, మురళి, దినేష్‌, ప్రభు, మస్తాన్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

    మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం - Additional Image