Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీనియర్‌ జర్నలిస్టు ఇక్కలూరి రాజేష్‌ మృతి. జర్నలిస్టు లోకానికి తీరని లోటు.. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నాయకుల సంతాపం

    Author RAJANEETHI | 15 Sep 2026, 03:36 PM | ANDHRA PRADESH
    సీనియర్‌ జర్నలిస్టు ఇక్కలూరి రాజేష్‌ మృతి.                      జర్నలిస్టు లోకానికి తీరని లోటు.. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నాయకుల సంతాపం

    చౌడేపల్లి, సెప్టెంబర్‌ 15 (రాజనీతి): మంచికి మారుపేరుగా, అజాతశత్రువుగా పేరుపొందిన చౌడేపల్లి సీనియర్‌ జర్నలిస్టు ఇక్కలూరి రాజేష్‌ (43) ఆకస్మిక మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆది నుంచి వివాదరహితుడిగా ఉంటూ ‘మనం’, ‘ఆంధ్రనాడు’, ‘సూర్య’ తదితర పత్రికల్లో పనిచేసిన రాజేష్‌ ప్రస్తుతం ప్రజాశక్తిలో సేవలందిస్తున్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ యూనియన్‌లో చురుగ్గా పాల్గొంటూ యూనియన్‌ పిలుపునిచ్చిన పలు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజేష్‌ టెంట్‌ హౌస్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కొంతకాలంగా రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో మృతి చెందారు. ఆయనకు భార్య సంగీత, కుమార్తెలు సౌమ్య, భవ్యశ్రీ ఉన్నారు. సౌమ్యకు ఇటీవల అనంతపురంలో వివాహం కాగా, భవ్యశ్రీ మదనపల్లె సమీపంలోని సిద్ధార్థ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మృతుడి తండ్రి కృష్ణయ్య కూడా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. రాజేష్‌ మృతితో కుటుంబ సభ్యులతో పాటు చౌడేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు, చౌడేపల్లి ప్రెస్‌క్లబ్‌ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.