Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జాతర రద్దీలో పోయిన సెల్‌ఫోన్‌.. తిరిగి అప్పగించిన పోలీసులు

    Author RAJANEETHI | 09 Sep 2026, 08:52 PM | ANDHRA PRADESH
    జాతర రద్దీలో పోయిన సెల్‌ఫోన్‌.. తిరిగి అప్పగించిన పోలీసులు

    రేణిగుంట, సెప్టెంబర్ 9 (రాజనీతి): కరకంబాడి పంచాయతీ పరిధిలోని శ్రీశ్రీశ్రీ కట్ట పుట్టాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భక్తుల రద్దీ మధ్య ఓ మహిళ తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకుంది. ఫోన్‌ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె అక్కడే విధులు నిర్వహిస్తున్న రేణిగుంట అర్బన్‌ ఎస్‌ఐ శ్రీనివాసులను ఆశ్రయించి విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బంది సహకారంతో సెల్‌ఫోన్‌ ఆచూకీ కోసం చర్యలు చేపట్టి, దానిని గుర్తించి సదరు మహిళకు సురక్షితంగా తిరిగి అప్పగించారు. పోయిందనుకున్న ఫోన్‌ను పోలీసులు చొరవ తీసుకుని తిరిగి అందించడంతో మహిళ ఆనందం వ్యక్తం చేసి ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ, భక్తులకు భద్రత కల్పించడంతో పాటు అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది.